logo

రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రి మృతి


22-Jun-2019 10:03IST
Two killed in road accident

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన శనివారం ఉద‌యం యాదాద్రి భువనగిరి జిల్లా  భువనగిరి మండలంలోని నాగిరెడ్డిపల్లి వద్ద చోటుచేసుకుంది. పోలీసులు క‌థ‌నం ప్రకారం..వలిగొండకు చెందిన వినయ్‌(20), క్రాంతి(23) మోటార్‌సైకిల్‌పై భువనగిరి నుంచి వలిగొండవైపు వెళ్తున్నారు. నాగిరెడ్డిపల్లి సమీపంలోకి రాగానే ఎదురుగా అతివేగంగా వస్తున్న డీసీఎం వాహనం .. ద్విచక్రవాహనాన్ని ఎదురుగా బ‌లంగా ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం  జిల్లా ద‌వాఖాన‌కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాఘవేందర్‌ తెలిపారు.

Tags: road accident bhuvanagiri

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top