logo

బీజేపీ నేతపై చీటింగ్ కేసు న‌మోదు


22-Jun-2019 10:54IST
BJP leader on cheating case

చిట్టీ వ్యాపారం పేరుతో వ్యక్తిని నమ్మించి రూ.10లక్షల మేర మోసం చేసిన బీజేపీ నేతపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో శ‌నివారం కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం..బంజారాహిల్స్ రోడ్ నం.14లోని నందినగర్‌లో నివాసం ఉంటున్న చంద్రశేఖర్ వెంకటేశ్వరనగర్ కాలనీ డివిజన్ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. గ‌త కొద్దికాలంగా చిట్టీల వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్ర‌మంలఓనే శ్రీ వెంకటేశ్వరనగర్ బస్తీకి చెందిన సాంబశివరావు(70) రూ.10లక్షల చిట్టీ వేశాడు. గత ఏడాది ఫిబ్రవరిలో చిట్టీ ఎత్తిన సాంబశివరావుకు రూ.8.3లక్షల వరకు వచ్చాయి. ఆ డబ్బును చంద్రశేఖర్ తనవద్దే ఉంచుకుని వడ్డీ ఇస్తానని చెప్పి.. కొంతకాలం వ‌డ్డీ ఇచ్చాడు. అలాగే మరో చిట్టీని వేయించుకున్నాడు. అయితే బాధితుడు కొత్త చిట్టీని మధ్యలో ఆపేశాడు. ఇప్పటి వరకు కట్టిన డబ్బుతో పాటు వడ్డీకి ఇచ్చిన మొత్తం కలిసి రూ.13లక్షలు అయ్యాయని, ఇవి ఇవ్వాల్సిందిగా కోరాడు. దీంతో అతను బుకాయించ‌డడం మొద‌లుపెట్టాడు.  దీంతో బాధితుడు పోలీసులను ఆశ్ర‌యించాడు.

Tags: bjp leader hyderabad chits frad

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top