logo

వేడుకకు వచ్చి.. పరలోకానికి


22-Jun-2019 12:00IST
came to the ceremony  to heaven

నల్గొండ:  సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం సీతరాంపురం గ్రామ శివారులో కోదాడ- హుజూర్‌నగర్‌ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా ఇద్దరి పరిస్థితి నిలకడగా వుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆఫ్జల్‌ పాషా, సర్వర్‌ పాషా, మహబూబ్‌పాషా, యాకూబ్‌ పాషా అన్నదమ్ములు. వీరిలో యూకూబ్‌ పాషా హుజూర్‌నగర్‌లో ఉంటుండగా.. మిగిలినవారు చింతపల్లిలో నివాసముంటున్నారు. వీరందరికీ వివాహాలు అయ్యాయి. వివిధ వ్యాపారాల్లో స్థిరపడ్డారు. తమ సొంత అక్క మనవరాలి బారసాల వేడుకకు ఆఫ్జల్‌ పాషా, మహబూబ్‌ పాషా సోదరుల దంపతులు, ముగ్గురు పిల్లలు కోదాడకు వచ్చారు. అనంతరం తమ జాన్‌పహాడ్‌ సైదులును దర్శించుకున్నారు. తెల్లవారుజామునే ఇంటికి తిరిగి వెళ్లాలని ఆటోలో ప్రయాణమయ్యారు. వారు సీతరాంపురం గ్రామ శివారు కోదాడ- హుజూర్‌నగర్‌ రోడ్డు మీదకు రాగానే ఎదురుగా వస్తున్నలారీ ఢీకొనడంతో ఆటోలో వున్నా నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.  క్షతగాత్రులను హుజూర్‌నగర్‌ వైద్యశాలకు తరలించారు. గాయపడ్డవారిలో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనాస్థలికి ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ సుదర్శన్‌రెడ్డి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సీఐలు రవి, శ్రీనివాసరెడ్డి, ఎస్సై వెంకన్నగౌడ్‌ ఆధ్వర్యంలో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కోదాడ వైద్యశాలకు తరలించారు. ఆఫ్జల్‌పాషా, మహబూబ్‌పాషా సోదరుడు యాకుబ్‌పాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 
జరిగిన ప్రమాదం తీవ్రత పెరగటానికి పరిమితికి మించి ప్రయాణికులకు ఆటోలో ఎక్కించడమే కారణమని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదానికి గురైన బజాజ్‌ ఆటోకు ముగ్గురు ప్రయాణికులను రవాణా చేసేందుకు మాత్రమే అనుమతి ఉంది. ఇందులో ఏడుగురు ప్రయాణికులను ఆటో డ్రైవర్  ఎక్కించుకున్నారు. వెనుక సీటులో నలుగురు, డ్రైవింగ్ సీటుకి రెండు వైపులా ముగ్గురు కూర్చున్నట్లు తెలిసింది. అంతే కాకుండా త్వరగా గమ్యస్థానానికి వెళ్లాలనే తాపత్రయంతో మితిమీరిన వేగంతో వాహనాన్ని చోదకుడు నడిపినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు.

Tags: ceremony heaven 6 members died suryapeta

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top