logo

రాజేంద్రనగర్ లో దొంగల బీభత్సం


22-Jun-2019 14:55IST
thefts in rajendra nagar

రాజేంద్రనగర్ పోలీస్టేషన్ పరిధిలోని అత్తాపూర్ లో అర్దరాత్రి దోపిడీ దోంగలు బీభత్సం సృష్టించారు. అందరు నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి చోరబడిన దుండగులు ఇంటి యజమానులపై మత్తు మందు జల్లి దోంగతనానికి తెగబడ్డారు. వివరాలలోకి వెళితే  సైబరాబాద్ కమిషన్ రేట్ రాజేంద్రనగర్ పోలీస్టేషన్ పరిధిలోని అత్తాపూర్ లో రాజేష్ అనే వ్యక్తి ఇంట్లో అర్దరాత్రి దోపిడీ దోంగలు రెచ్చిపోయారు. రాజేష్ కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి చోరబడిన దుండగులు రాజేష్ కుటుంబ సభ్యులపై ఒక రకమైన మత్తు మద్దు జల్లి బిరువాలోని మూడు తులాల బంగారం, కొంత నగదు, సెల్ ఫోన్ ఎత్తుకెళ్తుండగా రాజేష్ అరవడంతో తమతో తెచ్చుకున్న ఆటోను వదిలి పరారైయ్యరు. రాజేష్ ఫిర్యాదు మేరకు రాజేంద్రనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. సిసి కెమెరాల ఆధారంగా దోంగతనానికి గల అధారాలను సేకరిస్తున్నామని , త్వరలోనే దొంగలను పట్టుకొంటామని పోలీసులు తెలిపారు. 

Tags: thefts rajendra nagar

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top