logo

విద్యుదాఘాతానికి గురై ఎనిమిది పశువులు మృతి


22-Jun-2019 16:06IST
eight cattle killed due to electrocution

ఒడిస్సా : నెమిలిగుడ పరిధిలోని చరంగూల్‌కి చెందిన నువాగాంలో విద్యుదాఘాతానికి ఎనిమిది పశువులు మృతి చెందాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...గాసి హాంతల్ అనే రైతు తన పశువులను మేపడానికి తన పొలంలోకి తీసుకొని వెళ్లగా వర్షం పడే సూచనలు కనిపించడంతో పశువులను ఇంటి తీసుకొచ్చి  సమీపంలోని పశువుల శాలలో కట్టేసాడు. అంతలోనే పెనుగాలులతో కూడిన వర్షం పడింది. ఆసమయంలో పిడుగుపాటుకు విద్యుత్తు తీగలు తెగి పశువుల శాలలోపై పడడంతో ఎనిమిది పశువులు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాయి. దీంతో తమ ఉపాధి పోయిందని గాసి దంపతులు రోదిస్తున్నారు. రెవెన్యూ అధికారులు చేరుకుని నష్టాన్ని అంచనా వేశారు. ప్రభుత్వానికి నివేదికను పంపి సాయం అందేలా చేస్తామని సిమిలిగుడ తహసీల్దార్‌ శరత్‌చంద్ర మాఝి తెలిపారు. 

Tags: eight cattle killed electrocution

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top