logo

విద్యుత్ చౌర్యం చేశారు అదేంట‌ని అడిగిన అధికారుల‌కు చుక్క‌లు చూపించారు


23-Jun-2019 12:04IST
The power was recovered and the dots were shown to the officers who asked

కామారెడ్డి జిల్లాలో మ‌ద్న‌ర్ మండ‌లం వ‌ద్ద సోమూర్ గ్రామంలో విద్యుత్‌ చౌర్యానికి పాల్పడుతున్నట్లు వ‌చ్చిన సమాచారంతో ఆ శాఖ అధికారుల బృంధం ఆదివారం ఉదయం 6.30 గంటలకు సోమూర్‌ గ్రామానికి వెళ్లింది.  గ్రామానికి వెళ్లిన విద్యుత్‌శాఖ అధికారులపై ఓ కుటుంబం దాడి చేసింది. బాధితుల‌ వివరాల మేరకు.. సోమూర్లో విద్యుత్‌ చౌర్యానికి పాల్పడుతున్న ఇండ్ల‌ను గుర్తించి ఫొటోలు, వీడియోలను చరవాణిలో చిత్రీకరిస్తుండగా.. ఓ కుటుంబసభ్యులు మూకుమ్మడిగా వచ్చి అధికారుల బృందంపై కర్రలతో దాడికి దిగారు అంతేకాకుండా ఊపిరి స‌ల‌ప‌కుండా పిడిగుద్దులు గుద్దారు. ఈ దాడిలో జుక్కల్ సబ్‌ ఇంజినీర్‌ నవీన్‌ తలకు  తీవ్రగాయాలయ్యాయి. మరో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో వారి నుంచి తప్పించుకుని మజ్నూర్‌ ప్రభుత్వ ద‌వాఖాన‌కు చేరుకున్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags: electric officers kamareddy somuru

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top