logo

యాంక‌ర్‌గా లాస్య రీఎంట్రీ ?


23-Jun-2019 12:56IST
Lasya Reentry as Anchor

జూలైలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ సీజ‌న్-3  పాల్గొనే కంటెస్టెంట్స్ వీరేనంటూ ప‌లువురి జాబితా సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఈ హంగామా నెల ముందే మొద‌లైంది. ఇప్ప‌టికే ప‌లు ప్రోమోల‌తో స్టార్ మా అంచనాలు పెంచుతుంది. మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు కార్య‌క్ర‌మంతో బుల్లితెర ప్రేక్ష‌కులని అల‌రించిన నాగ్ ఈ సీజ‌న్ 3ని హోస్ట్ గా చేయ‌నున్నారు. ఇక ఇందులో కంటెస్టెంట్స్‌గా ఎవ‌రు ఉంటార‌న్న‌దే ఇప్పుడు అస‌లు సిస‌లైన చ‌ర్చ‌.  ఇందులో యాంక‌ర్స్‌, రాజకీయ నాయ‌కులు, న‌టులు, క్రీడా ప్ర‌ముఖులు ఉన్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం కొన్నాళ్ళ క్రితం యాంక‌ర్ ర‌వితో క‌లిసి బుల్లితెర‌పై సందడి చేసిన లాస్య బిగ్ బాస్-3లో పాల్గొన‌బోతుంద‌ని స‌మాచారం. ఇటీవ‌ల త‌ల్లి ప్ర‌మోష‌న్ కూడా అందుకున్న ఈ అమ్మ‌డు మ‌ళ్ళీ బిగ్ బాస్ కార్య‌క్ర‌మంతో లైమ్ లైట్‌లోకి రావాలని అనుకుంటుంద‌ట‌. 

Read latest Movies News and Telugu News Follow us on FaceBookTwitter

Tags: lasya bigboss -3 season nagarjuna

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top