logo

రాజస్థాన్‌లో దారుణం


24-Jun-2019 11:51IST
worst in rajasthan

  • గుడారం కూలి 14 మంది మృతి
  • మరో 50 మందికి గాయాలు
రాజ‌స్థాన్‌:  జైపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం కోసం ఏర్పాటుచేసిన గుడారాలు కూలడంతో14 మంది అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. మరో 50 మంది గాయపడ్డారు. జైపూర్‌కు 500 కిలోమీటర్ల దూరంలోని బర్మెర్‌ జిల్లా జసోల్‌లోని రాణి బటియాని దేవాలయం వద్ద ఈ ఘోరం జరిగింది. ఈ నెల 30 వరకూ నిర్వహించే ఒక మత కార్యక్రమం కోసం దేవాలయం సమీపంలోని పాఠశాల వేసిన భారీ గుడారం పెద్ద గాలి వాన రావడంతో గుడారం కూలిపోయింది. విద్యుత్‌ తీగలు కూడా తెగి పడటంతో ప్రమాద తీవ్రత పెరిగింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షలు చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. ప్రధాని మోడీ, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్‌లు ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

Read latest National News and Telugu News |
Follow us
 on FaceBook, Twitter

Tags: rajasthan గుడారం 14 people die

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top