logo

కామాంధుడి కాటుకి బ‌లైన కుటుంబం..


24-Jun-2019 16:50IST
family of the bite of kamandhu

నిజామాబాద్: ఈ మ‌ధ్య తెలుగు రాష్ట్రాల్లో వ‌రుసగా అత్యాచార ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్నాయి. అత్యాచారాల వల్ల బాధితులే కాదు.. వారి కుటుంబాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. నెల రోజుల క్రితం ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడి భార్య, బిడ్డలను గ్రామం నుంచి వెలి వేసిన సంఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. జిల్లాలోని ఓ గ్రామంలో ఆరేళ్ల బాలికపై ఓ వ్యక్తి గత నెలలో అత్యాచారానికి పాల్పడ్డాడు. భార్యా, పిల్లలతో కలిసి జీవిస్తున్న ఓ కామాంధుడు తమ ఇంటికి ఎదురుగా ఉండే చిన్నారిపై కన్నేసి ఎవరూ లేని సమయంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు నిందితుడి చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో స్థానికులు తమపై దాడి చేసే అవకాశముందని ఆందోళన పడిన నిందితుడి కుటుంబం గ్రామం వదిలి వెళ్లిపోయింది. కొద్దిరోజుల క్రితం నిందితుడి భార్య, పిల్లలతో కలిసి తిరిగి గ్రామానికి వచ్చి జీవిస్తోంది. ఎదురెదురు ఇళ్లు కావడంతో బాధిత చిన్నారి నిందితుడి కుటుంబాన్ని చూసి భయపడుతోంది. దీంతో బాలిక తల్లి ఈ విషయాన్ని గ్రామ పెద్దల వద్దకు తీసుకెళ్లింది. దీనిపై మహిళా సంఘాలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సమావేశమై బాధితురాలి మానసిక పరిస్థితి దృష్ట్యా నిందితుడి కుటుంబాన్ని గ్రామం నుంచి పంపించేయాలని నిర్ణయించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBookTwitter

Tags: rape girl nizamabad crime village eliminated

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top