logo

ఇసుక తవ్వకాల్లో మట్టి పొర కూలి వ్యక్తి మృతి


24-Jun-2019 16:53IST
man killed in sand mining

కరీంనగర్:  కొత్తపల్లిలోని ఖాజీపూర్‌ మానేరు వాగులో ఇసుక తవ్వకాల్లో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై స్వరూప్‌రాజ్‌ తెలిపిన వివరాల ప్రకారం... చొప్పదండి పట్టణానికి చెందిన మాచర్ల పవన్‌కుమార్‌ ఇదే పట్టణంలోని లవకుమార్‌ ట్రాక్టర్‌పై కూలీగా పని చేస్తున్నాడు. రోజులాగానే నిన్న పనికి ఖాజీపూర్‌ మానేరు వాగులోకి వెళ్లాడు. ట్రాక్టర్‌ను వాగులో నిలిపి నాణ్యమైన ఇసుక కోసం మట్టి కింది భాగంలో సోరంగం మాదిరిగా తవ్వాడు. లోపలి నుంచి ఇసుక తవ్వి ట్రాక్టర్‌లో నింపుతున్నాడు. ఈ క్రమంలో పవన్  ఇసుక పై భాగంలో ఉన్న మట్టిపొర కుంగి పోవటాన్ని గమనించక పోవడంతో అది కూలి పవన్ మీద పడిందింది. దాంతో ఇసుకలో కూరుకుపోయాడు. అక్కడే ఉన్న వారు గమనించి ఇసుక తోడి బయటకు తీశారు. ఊపిరాడక అప్పటికే మృతి చెందాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.  

Tags: pavan killed sand mining khajipoor

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top