logo

ప్రేమ‌జంట ఆత్మ‌హ‌త్య‌..!


25-Jun-2019 08:02IST
Suicide of a lovers

వారు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామ‌ని బాస‌లు చేసుకున్నారు. అయితే వారి ప్రేమ పెళ్లి పీట‌లు ఎక్క‌డానికి త‌ల్లిదండ్రులు అడ్డుప‌డ్డారు. దీంతో ప్రేమజంట శీతల పానీయంలో గుళికల మందు కలుపుకొని తాగి సోమవారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేసింది.  చైతన్యపురి పోలీసులు వివరాల ప్రకారం. నల్గొండ జిల్లా రాగన్నగూడకు చెందిన బంధువులైన యువతీ యువకులు గ‌త కొంత‌కాలంగా ప్రేమించుకుంటున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ విష‌యం ఇద్దరి తల్లిదండ్రులకు తెలియ‌డంతో ఈ విషయంపై గొడవ జరిగింది. దీంతో దిల్‌సుఖ్‌న‌గర్‌ రాజధాని థియేటర్ వ‌ద్ద  యువకుడు అద్దెకుండే గ‌దిలో ఇద్ద‌రూ ఆత్మ‌హ‌త్య‌కు ఒడిగ‌ట్టారు.  సందీప్‌రెడ్డి(36) మృతిచెందగా, ప్రియురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.  మెరుగైన చికిత్స కోసం యువతిని మలక్‌పేట యశోద ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది..

Tags: lovers Suicide hyderabad appollo hospital chaitanyapuri

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top