logo

రహదారిపై విరిగిపడ్డ చెట్టు...రాకపోకలకు ఇక్కట్లు


25-Jun-2019 15:05IST
a tree fallen on the road disruption to traffic

జగిత్యాల:  కేశవపట్నం వద్ద కరీంనగర్‌-వరంగల్‌ ప్రధాన రహదారిపై సోమవారం ఉదయం పెద్ద చెట్టు విరిగిపడడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ఎస్సై సత్యనారాయణ, సిబ్బంది వెంటనే చెట్టు విరిగిన స్థలానికి వెళ్లి కొమ్మలు తొలిగించేందుకు ప్రయత్నించారు. చెట్టుకోసే యంత్రాన్ని తెచ్చి కొమ్మలను తొలిగించారు. గంటకు పైగా వాహనాలు నిలిచి పోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. బస్సులోని కొందరు ప్రయాణికుల సహాయంతో చెట్టును తొలగించడంతో రాకపోకలు కొనసాగాయి. ఇదే రోడ్డుపై నిత్యం వేలసంఖ్యలో వాహనాల రాకపోకలు జరుగుతుంటాయి. ఉదయం పెద్ద చెట్టు విరిగిపడ్డ సమయంలో వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వర్షాకాలంలో చెట్లు ఎక్కువగా విరిగిపడుతున్నాయి. అధికారులు ఇప్పటికైనా ప్రమాదకరంగా ఉన్న చెట్లు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. 

Tags: tree fallen road disruption traffic

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top