logo

ఏపీ మంత్రి వర్గంలో అత్యంత ధనవంతుడు ఎవరో తెలుసా ?


26-Jun-2019 14:14IST
richest mp in ap ministers list

ఏపీ మంత్రి వర్గంలో అత్యంత ధనవంతుల లిస్టును అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. అందులో ఏపీ మంత్రి వర్గంలో అత్యంత దనవంతుడు ముఖ్యమంత్రి జగనే అని ఏడీఆర్ తెలిపింది. కేబినెట్‌లోని 26 మంది సమర్పించిన ఎన్నికల ప్రమాణ పత్రాలను పరిశీలించిన అనంతరం ఏడీఆర్ ఓ జాబితాను విడుదల చేసింది. దాని ప్రకారం సీఎం జగన్ రూ.510 కోట్ల ఆస్తులతో అగ్రస్థానంలో ఉండగా, రూ.130 కోట్లతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెండో స్థానంలో నిలిచారు. రూ.61 కోట్లతో మేకపాటి గౌతంరెడ్డి మూడో స్థానంలో ఉన్నారు. కాగా కేబినెట్‌లోని 17 మంది మంత్రులపై క్రిమినల్ కేసులు ఉండగా. అప్పుల విషయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అందరికంటే ముందున్నారు. ఆయనకు రూ.20 కోట్ల అప్పులున్నాయి.  చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు రూ.12 కోట్లు, ముత్తంశెట్టి (అవంతి) శ్రీనివాసరావుకు రూ.5 కోట్లు ఉన్నట్టు ఏడీఆర్ తన నివేదికలో పేర్కొంది. జగన్ కేబినెట్‌లోని 26 మంది మంత్రుల్లో 23 మంది అంటే 88 శాతం మంది కోటీశ్వరులేనని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. మంత్రుల సగటు ఆస్తి రూ.35.25 కోట్లుగా వివరించింది.

Tags: richest man ap ministers list

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top