logo

ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి


26-Jun-2019 17:50IST
software employee sudden dearth in Australia

నల్గొండ: వనస్థలీపురరం నగరానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆస్ట్రేలియాలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... నల్గొండ జిల్లా వలిగొండ మండలంలోని గొల్లపల్లికి చెందిన సామ అర్జున్‌రెడ్డి వనస్థలిపురంలోని భాగ్యలత బీడీఎల్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు. హైదరాబాద్ లోనే ఇంగినీరింగ్ పూర్తిచేసి ఎంఎస్‌ చేసేందుకు ఆస్ట్రేలియా వెళ్ళాడు. ఎంఎస్‌ పూర్తికాగానే సిడ్నీలో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. అతడికి భార్య మహేశ్వరి, రెండేళ్ల కూతురు ఇషిక ఉన్నారు. రోజూలాగే ఆఫీస్ కి వెళ్లిన అర్జున్‌రెడ్డి విధుల్లో ఉండగా అకస్మాత్తుగా గుండె నొప్పి రావడంతో భార్యకు ఫోన్‌లో సమాచారం అందించారు. కంపెనీ వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని ధ్రువీకరించారు. ఉదయం 11గంటలకు తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో ఇంటి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. తన కుమారుడి మృతదేహాన్ని త్వరగా హైదరాబాద్‌కు తెచ్చే విధంగా ప్రభుత్వం సహాయపడాలని తండ్రి కోరుతున్నారు.

Tags: software employee sudden dearth Australia

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top