logo

విజయనిర్మల మృతిపట్ల ప్రముఖుల సంతాపం ...


27-Jun-2019 09:33IST
celabraties condolences on vijaya nirmala died

ప్రముఖ నటి, దర్శకురాలు, ప్రముఖ నటుడు సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల బుధవారం(నిన్న) అర్ధరాత్రి (73) కన్నుమూశారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె బుధవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. ఆమె మృతి పట్ల ప్రముఖులు ట్విట్టర్ ద్వారా  దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.  
 
ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల మృతి పట్ల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
 
తెలంగాణ సీఎం కేసీఆర్ విజయనిర్మల మృతికి సంతాపం వ్యక్తం చేశారు. నిర్మల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.. 
  
అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నీస్ బుక్ రికార్డు సాధించిన మేటి దర్శకురాలైన విజయనిర్మల మరణం చిత్రపరిశ్రమకు తీవ్ర లోటని సీఎం జగన్ పేర్కొన్నారు.

Tags: celabraties condolences vijaya nirmala died

Advertisement
Advertisement
Top