logo

నీరవ్‌ మోదీ స్విస్‌ ఖాతాలు పనిచేయవు : ఈడీ


27-Jun-2019 15:58IST
swiss accounts of Nirav Modi do not work ED

న్యూదిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో ప్రధాన నిందుతుడు నీరవ్‌ మోదీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. అధికారులు ఆయనకు చెందిన నాలుగు స్విస్ బ్యాంకుల ఖాతాలను స్తంభింపజేశారు. అలాగే తన సోదరి పూర్వీ మోదీ ఖాతాలను కూడా స్తంభింపజేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ తెలిపారు. ఆయన ఆదేశాల మేరకు అధికారులు ఖాతాలను స్తంభింపజేశారు. అయితే నిందుతుడు నీరవ్‌ మోదీ కోద్ది రోజుల క్రితం లండన్ పారిపోయి అక్కడ తలదాలచుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు అతన్ని అరెస్ట్ చేశారు. అతను పలు సార్లు బెయిల్ కోసం పిటిషన్లు వేసినప్పటికీ పలుసార్లు న్యాయమూర్తులు నిరాకరించారు.  అతనిపై వున్నా ఆరోపణలపై పలుమార్లు న్యాయస్థానం విచారించింది. లండన్‌లోని ఓ న్యాయస్థానంలో మరోసారి విచారించనుంది. ప్రస్తుతం జైల్లో ఉంటున్న ఆయన వీడియో లింక్‌ ద్వారా విచారణకు హాజరుకావడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. యూకే చట్టాల ప్రకారం ఆయనపై విచారణ కొనసాగుతోంది. 

Tags: swiss accounts Nirav Modi ED

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top