logo

ఇండియాలో ముందుగా విడుదలవుతున్న `స్పైడర్ మ్యాన్


28-Jun-2019 14:34IST
spider man realese one day before  in india

`స్పైడర్ మ్యాన్: ఫార్ ఫ్రమ్ హోం` చిత్రాన్ని ఓ రోజు ముందుగానే సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియా విడుదల చేస్తుంది. ఇంగ్లీశ్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో జూలై 4న ఈ సినిమా భారీ రేంజ్లో విడుదలవుతుంది. మార్వెల్ సంస్థ నుండి వస్తున్న సినిమాలపై క్రేజ్ క్రమంగా పెరుగుతుంది. ఈ సందర్భంగా... సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ కృష్ నాని మాట్లాడుతూ ``సూపర్హీరో స్పైడర్ మ్యాన్ సినిమాలకు ఇండియాలో మంచి క్రేజ్ ఉంటుంది. ప్రారంభం నుండే `స్పైడర్ మ్యాన్: ఫార్ ఫ్రమ్ హోం`పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సినిమాను జూలై 4న విడుదల చేస్తున్నాం. 30వ తారీఖునే ఈసినిమా బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. హిందీ, తెలుగు, ఇంగ్లీష్, తమిళంలో సినిమాను విడుదల చేస్తున్నాం`` అన్నారు.

Tags: sony picture spyder spyder man for from home

Advertisement
Advertisement
Top