logo

తుపాకీ శుభ్రం చేస్తుండగా పేలి జవాన్ మృతి


28-Jun-2019 16:48IST
jawan died beacause of pistol cleaning

కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తుపాకీ శుభ్రం చేస్తుండగా జరిగిన ప్రమాదంలో మచిలీపట్టణంకు చెందిన ఎయిర్ ఫోర్స్ జవాన్ ప్రకాష్ మృతి చెందాడు. ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళ్తే బుధవారం విధుల నిర్వహణలో ఉండగా తన సర్వీస్ రివాల్వర్ ను శుబ్రం చేసుకుంటుండగా అనుకోకుండా రివాల్వర్ పేలింది. దీంతో ప్రకాశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమారం అనంతరం ఈ రోజు ఉదయము ప్రత్యేక విమానంలో గన్నవరంకు ప్రకాష్ మృతదేహం చేరుకుంది ఇక్కడ నుండి అంబులెన్సులో మచిలీపట్టణంకు మృతదేహం తీసుకువెళ్ళేరు.. ప్రకాష్ మృతితో మచిలీపట్టణంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Tags: jawan died cleaning pistol Rajasthan

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top