logo

సూర్య 'బందోబస్త్' ఫస్టులుక్ పోస్టర్ విడుదల ..


28-Jun-2019 17:16IST
surya bandobast firstlook poster release

NGK చిత్రం పరాజయం కావడంతో ఈసారి హిట్ కొట్టడానికి బాగా కష్టపడుతున్నాడు తమిళ్ హీరో సూర్య. ప్రస్తుతం కాప్పాన్ చిత్రంతో బిజీగా ఉన్న సూర్య ఈ  చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కాప్పాన్ తెలుగు టైటిల్ ని, ఫస్టులు పోస్టర్ ని విడుదల చేసారు. దర్శక ధీరుడు రాజమౌళి తన ట్విట్టర్ ఖాతా ద్వారా సూర్య కాప్పాన్ తెలుగు టైటిల్ ని , ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసారు.  కేవీ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి బందోబస్త్ అనే టైటిల్ ని ఖరారు చేసారు. 
యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సూర్యతో పాటు మలయాళ స్టార్ మోహన్ లాల్‌, ప్రముఖ హీరో ఆర్య లీడ్ రోల్స్ లో నటిస్తుండగా సాయేషా హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఫస్ట్ లుక్ విషయానికొస్తే సూర్య కళ్లజోడు పెట్టుకుని తుపాకీతో పోజివ్వడం ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో మోహన్ లాల్ ప్రధానమంత్రి పాత్ర పోషిస్తుండగా, సూర్య ఆయనకి సెక్యూరిటీ ఆఫీసర్ గా ఉంటాడట. లైకా ప్రొడక్షన్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రంలో సూర్య తమ్ముడు కార్తీ  గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడు. కాగా ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకొన్నారు. మరి ఆ అంచనాలను సూర్య దాటగలడా ? లేదా అనేది చూడాలి. 

Tags: bandobast surya firstlook poster

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top