గార్లదిన్నె: మండలంలోని శిరివరం సమీప పొలాల్లో శుక్రవారం గుర్తుతెలి యని వ్యక్తి దారుణహత్యకు గురైన సంఘటన వెలుగుచూసింది. చేతులు వెనక్కు కట్టి, మొహానికి గుడ్డచుట్టి, ఇనుప కడ్డితో గొంతు బి గించి హత మార్చినట్లు గుర్తించారు. పోలీసులు కథనం ప్రకారం వివరాలివి. మృతదేహాన్ని యూరియా సంచిలో కట్టి పంటపొలాల్లో వేయడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ ఆంజనేయులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి. సంచిని తెరచి చూడగా అందులో మృతదేహం లభ్యమైంది. చేతులను వెనక్కు కట్టి, మొహానికి గుడ్డ చుట్టి, ఇనుప కడ్డితో గొంతు బిగించి హత్య చేశారని పోలీసులు గుర్తించారు. దుండగులను గుర్తించేందుకు జాగిలాలు, క్లూస్ టీంతో పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రెండురోజుల క్రితం హత్యచేసి ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు పేర్కొంటున్నారు. మృతదేహాన్ని గుర్తించేందుకు వివిధ పోలీస్స్టేషన్లకు సమాచారం అందించారు. డీఎస్పీ, పీఎన్. బాబు, అత్మకూరు రూరల్ సర్కిల్ సీఐ ప్రసాద్రావ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి వివరాలు, హత్యకు కారణాలపై పలు కోణా ల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.