logo

పాలకు ఉన్న విలువ... ప్రాణానికి లేదు... !!


29-Jun-2019 11:20IST
the value of milk  not for the life

రాజస్థాన్: రోజు రోజుకి మనుషులలో మానవత్వం మంటగలిసి పోతుంది. పక్కన ప్రాంణం పోతున్న కూడ అయ్యో అనేవారు కూడా కరువయ్యారు. ఇందుకు నిదర్శనం  రాజస్థాన్‌ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన చూస్తే ఆ అనుమానం రాక మానదు. వివరాల్లోకి వెళితే... రాజస్థాన్‌లోని ఝున్‌ఝును ప్రాంత సమీపంలో బిసావు రహదారిపై వేగంగా వెళ్తున్న పాల ట్యాంకర్‌ అదుపు తప్పి ఒక్కసారిగా పల్టీ కొట్టింది. భారీ మలుపు నేపథ్యంలో ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన డ్రైవర్, ఆపరేటర్ అందులో నుండి దూకి వారి ప్రాణాలను కాపాడుకున్నారు. కానీ వారిరువురికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ట్యాంకర్ నుండి కారుతున్న ఓ గంటెడు పాలకోసం రోడ్డు ప్రమాదంలో కొట్టుమిట్టాడుతున్న మనిషి ప్రాణాలను సైతం పట్టించుకోకపోగా, అందులో నుండి కారుతున్న పాలను బకిట్లతో ఎత్తుకెళ్లడానికి ఎగబడ్డారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఈ ఘటనతో సమాజంలో సాటి మనుషుల ప్రాణాలకు విలువే లేకుండా పోయిందని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.   

Tags: milk tanker accident rajasthan operater driver

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top