logo

రిస్క్‌ ఎందుకని భావించిన చైనా డిస్ట్రిబ్యూటర్లు...‘2.ఓ’ రద్దు?


29-Jun-2019 15:00IST
chinese distributors going to stop 20 cinema in china

బీజింగ్: ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన 'రోబో' సినిమాకి సీక్వల్గా సూపర్‌స్టార్ రజనీకాంత్‌, దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘2.ఓ’ సినిమా చైనాలో జులై 12న  విడుదల చేయనున్నారు. కానీ ఈ సినిమా చైనాలో విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు. టైటిల్‌ని ‘రోబో 2.ఓ: రీసర్జెన్స్‌’ అని మార్చి.. 56,000 స్క్రీన్లపై విడుదల చేయాలని హెచ్‌వై మీడియా సంస్థ నిర్ణయించుకుంది.

హెచ్‌వై మీడియా సంస్థ... 
హెచ్‌వై మీడియా సంస్థ తెలిపిన సమాచారం ప్రకారం...ఈ సినిమాని చైనాలో విడుదల చేస్తే డిస్ట్రిబ్యూటర్లకు మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉందని హెచ్‌వై మీడియా సంస్థ భావించింది. ఎందుకంటే గతంలో అక్షయ్ కుమార్ నటించిన 'ప్యాడ్‌మ్యాన్‌’ సినిమా అక్కడ అంతగా నడవక పోవడంతో చైనా డిస్ట్రిబ్యూటర్స్ చాలా నష్టపోయారు. సినిమాని విడుదల చేయడానికి అయిన ఖర్చును కూడా భర్తీ చేయలేకపోయిందనీ, దాంతో ‘2.ఓ’ కూడా అంతగా ఆడదేమోనని డిస్ట్రిబ్యూటర్లు భయపడుతున్నారు.
 
ది లయన్‌ కింగ్... 
అంతే కాకుండా ‘ది లయన్‌ కింగ్‌’ సినిమా కూడా జులైలోనే విడుదల అవుతున్న నేపథ్యంలో రిస్క్‌ ఎందుకని భావించిన డిస్ట్రిబ్యూటర్లు ‘2.ఓ’ విడుదలను రద్దు చేయాలని అనుకుంటున్నారట. ఒకవేళ  ‘2.ఓ’ని రిలీజ్ చేస్తే 25 మిలియన్‌ డాలర్లు వసూలు చేయాలి. అప్పుడే డిస్ట్రిబ్యూటర్లకు నష్టం వాటిల్లదు. అయితే ఈ విషయం గురించి చైనా చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంలో అమీ జాక్సన్‌ కథానాయికగా నటించారు. అక్షయ్‌ కుమార్‌ ప్రతినాయకుడి పాత్రను పోషించారు. రూ.300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలైంది.

Tags: chinese distributors 2.0 cinema china

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top