logo

ఆడపిల్ల బాగా చదువుకోవడం కూడా పాపమేనా?


01-Jul-2019 10:22IST
is it sinful for a girl to study well

లఖ్‌నవూ: విద్యాబుద్దులు నేర్పించాల్సిన గురువే ఓ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన దుర్ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.  వివరాల్లోకి వెళితే...సీతాపుర్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఓ బాలిక 8వ తరగతి చదువుతుంది. అంతే కాకుండా ఆమె కుటుంబానికే చెందిన మరో నలుగురు బాలురు (సమీప బంధువులు) కూడా అదే బడిలో చదువుకుంటున్నారు. ఆ బాలిక తన తరగతిలో ప్రథమురాలిగా నిలువగా.. పై తరగతులకు చెందిన ఆ నలుగురు బాలురు మాత్రం కొన్ని పరీక్షలలో తప్పారు.

దాంతో ఇంట్లోని పెద్దలు ఆ నలుగురిని మందలించడంతో అవమానంగా భావించారు. దాంతో ఆమె తమకంటే చదువుల్లో రాణిస్తోందన్న అసూయతో ఒకరోజు బడిలో విరామ సమయంలో సిబ్బంది గదిలోకి భోజనానికని పిలిచారు. భోజనంలో మత్తుమందు కలిపిన విషయాన్నీ గమనించక ఆ ఆహారాన్ని తినడంతో అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయింది. బాలిక స్పృహ కోల్పోగానే ఆ నలుగురు బాలురు ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. 

ఈ అకృత్యంలో విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ టీచర్‌  పాలుపంచుకోవడం సభ్య సమాజానికే మాయనిమచ్చ. సాక్షాత్తూ బడి ఆవరణలోనే లైంగిక దాడికి పాల్పడిన వారంతా.. ఈ దారుణాన్ని చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో ఉంచి మరింత నీచానికి ఒడిగట్టారు. ఆమెకు మెలకువ వచ్చిన తర్వాత.. ఇక్కడున్నానేమిటి అని ఆమె అడగడంతో ఆటస్థలంలో స్పృహ తప్పి పడిపోతే సిబ్బంది గదిలోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. అయితే ఆమెపై అకృత్యానికి పాల్పడిన దృశ్యాలు  ఓ వాట్సాప్‌ గ్రూపులో కనిపించడంతో ఆమెతో పాటు, తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఒకరిని అరెస్టు చేయగా మిగతా నలుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.    

Tags: Lakhnavu sinful girl study well

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top