logo

ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ప్ర‌మాదం


01-Jul-2019 10:26IST
road accident on the outer Ring Road

రంగారెడ్డి: శంషాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డుపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వనస్థలిపురానికి చెందిన దివ్య అనే మహిళ కారులో పెద్ద అంబర్‌పేట్ నుంచి గచ్చిబౌలి వస్తుండగా ఈ ఘటన జరిగింది. దివ్య వెళుతున్న కారు లారీని ఢీకొనడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags: road accident outer ringroad hyderabad

Advertisement
Advertisement
Top