logo

ఘోర ప్ర‌మాదం..


01-Jul-2019 10:58IST
bus in the valley 25 people dead

లోయలో పడ్డ బస్సు.. 25 మంది దుర్మర‌ణం
జ‌మ్మూ: జమ్ముకశ్మీర్‌లో విషాదం చోటు చేసుకున్నది. ప్రమాదవశాత్తు ఓ మినీ బస్సు లోయలో పడిపోయింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికుల్లో 25 మంది మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 45 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. కిష్ట్‌వార్ జిల్లాలో ఉదయం 7.30 సమయంలో లోయలో పడిపోయింది. సిర్గ్‌వారీ వద్ద లోయలో పడిపోయినట్టు పీటీఐ రిపోర్ట్ చేసింది. చనిపోయిన వారిలో 20 మంది మృతదేహాలను వెలికితీశారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బస్సు ప్రమాద ఘటనపై జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విచారం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు.

Tags: bus falls 25 people killed mini bus jammu

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top