logo

కూలర్‌లో మత్తుమందు కలిపి చోరీ చేశారు ...


01-Jul-2019 16:03IST
mixing some toxins in air cooler before theft

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని ఖంఝావాల్ ప్రాంతంలోని ఒక ఇంట్లో విచిత్ర రీతిలో దొంగతనం జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దొంగతనానికి ముందు దొంగలు కూలర్‌లో ఏదో మత్తుపదార్థం కలిపి, ఇంట్లోని వారంతా స్పృహ తప్పేలా చేశారు. తరువాత చోరీ చేశారు. ఉదయం స్పృహలోనికి వచ్చిన ఆ ఇంట్లోనివారు గమనించగా ఇంట్లోని విలువైన వస్తువులు కనిపించలేదు. ఇంకా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. బాధితురాలు సోనియా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...సోనియా తన కుటుంబ సభ్యులతో పాటు మదన్‌పుర్ డబాస్‌లో ఉంటూ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. విధుల నుండి ఇంటికి వచ్చాక తాను రాత్రి భోజనం చేసి తల్లి హఫీజన్, తండ్రి అహసాస్ అలీతో పాటు గ్రౌండ్ ఫ్లోర్‌లో నిద్రపోయింది. ఆమె సోదరి సుల్తానా మరో గదిలో పడుకుంది.  వారు నిద్రపోతున్న సమయంలో ఇంటి బయటనున్న కూలర్ నుంచి దుర్వాసన రావడన్ని గమనించామని, అయితే అంతతోనే స్పృహ తప్పిపోయామని తెలిపింది. దాంతో అనారోగ్యం కారణంగా ఉదయం సంజయ్ గాంధీ ఆసుపత్రిలో చేరామని పేర్కొంది. దొంగలు ఇంట్లోని విలువైన సామానంతా చోరీ చేశారని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags: toxins air cooler theft

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top