logo

ట్యాంకులో పడి నాలుగేళ్ల బాలుడు మృతి


01-Jul-2019 17:31IST
fouryearold boy found dead in water tank

విదిశ: మధ్యప్రదేశ్‌కు చెందిన విదిశలోని అరిహంత్ విహార్‌లో విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నాలుగేంళ్ల బాలుడు ఆరడుగుల లోతైన ట్యాంకులో పడి మృతి చెందాడు. తండ్రి పాలిటెక్నిక్ కాలేజీ ప్రొఫెసర్ మహేంద్ర తెలిపిన వివరాల ప్రకారం... ఉదయం ఆయన కుమారుడు అనంత్ ఇంటి బయట ఆడుకుంటున్నాడు. దాంతో వాడికి స్నానం చేయించడానికి తండ్రి ఇంటి బయటఉన్న ట్యాంకులో నుంచి ఒక బకెట్ నీటిని తీసుకువచ్చి బాత్రూమ్‌లో పెట్టారు. తరువాత ఆ ట్యాంకుకు మూతవేశారు. అయితే అనంత్ కనిపించకపోవడంతో ఇంట్లోని వారంతా వెదకసాగారు. ఇంతలో ఎవరో ఒకసారి ట్యాంకులో చూడలేకపోయారా? అని సలహా ఇచ్చారు. దీంతో తండ్రి వెంటనే ట్యాంకు మూత తెరచి చూశారు. అక్కడ అనంత్ అచేతన స్థితిలో కనిపించాడు. కుమారుడిని బయటకు తీసుకువచ్చి, ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అనంత్ మృతి చెందాడని వైద్యులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అనంత్ తాత, రిటైర్డ్ ఉద్యోగి రామానంద్ మోర్ మాట్లాడుతూ నీటి కొరత కారణంగా ఏడాది క్రితమే ఇంటి బయట ట్యాంకును నిర్మించుకున్నామని తెలిపారు. అయితే అదే తన మనుమడి మృతికి కారణమవుతుందని ఏనాడూ అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.   

Tags: four-year-old boy dead body water tank

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top