logo

భద్రత విషయంపై హైకోర్టులో పిటిషన్ వేసిన చంద్రబాబు


02-Jul-2019 11:07IST
chandrababu naidu lodged a petition in highcourt over reducing security

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన భద్రతను కుదించిందని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు హైకోర్టును ఆశ్రయించారు. కుదించిన భద్రతను తిరిగి పునరుద్దరించాలని పిటిషన్ దాఖలు చేశారు. దీంతో చంద్రబాబు పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. మంగళవారం దీనిపై కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. మరోవైపు చంద్రబాబుకు భద్రత కుదించలేదని. నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన భద్రత కంటే ఎక్కువ భద్రతనే కల్పిస్తున్నామని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. 

చంద్రబాబు భద్రతా సిబ్బందిలో ఇటీవల 15 మందిని ప్రభుత్వం తొలగించింది. ఇంతకుముందు ఆయనకు ఒక అడిషనల్‌ ఎస్పీ, డిఎస్పీ, ముగ్గురు ఆర్‌ఐలు భద్రతా విధుల్లో ఉండేవారు. ప్రస్తుతం టు ప్లస్‌ టు పద్దతిలో భద్రతా సిబ్బందిని కేటాయించింది. చంద్రబాబు కుటుంబానికి, నారావారి పల్లెలో ఆయన నివాసానికి కల్పిస్తున్న భద్రతను కూడా కుదించిన సంగతి తెలిసిందే.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBookTwitter

Tags: chandrababu naidu petition highcourt security

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top