logo

మైనర్ బాలికపై అత్యాచారం....


02-Jul-2019 15:23IST
minor girl pregnant after being raped by brother in law in telangana

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దారుణం చోటు చేసుకుంది. వరుసకు బావ అయిన రేవేళ్ల సాయి అనే యువకుడు బంధువైన మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని, మనిద్దరి మధ్యే ఉండాలని చెప్పి ఆమెకు బహుమతులు ఇచ్చేవాడు. దీంతో బాలిక ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఈ క్రమంలో బాలిక శరీరంలో మార్పులు గమనించిన తల్లిదండ్రులు ఏం జరిగిందని కుమార్తెను నిలదీయగా సాయి తనపై జరుపుతున్న అఘాయిత్యాన్ని వివరించింది. బాలికకు గర్భం రావడంతో ఆ కామాంధుడు అబార్షన్ చేయించేందుకు ఆస్పత్రికి తీసుకెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అతడిపై ఫిర్యాదు చేసేందుకు తల్లిదండ్రులు బాలికను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.

Tags: minor girl pregnant raped brother in law telangana

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top