logo

అవినీతి జరిగితే సహించను


03-Jul-2019 09:54IST
i will not tolerate corruption

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి 
అమరావతి: అర్హులైన ప్రతి లబ్దిదారునికి 1.5 సెంట్ల భూమి ఇస్తామని, ఉగాది నాటికి పట్టాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేయడంతోపాటు వైఎస్‌ఆర్‌ ఇళ్ల కింద నాలుగు దశల్లో గృహనిర్మాణం చేపతామని ఏపీ సీఎం జ‌గ‌న్ తెలిపారు. లబ్దిదారుల ఎంపిక గ్రామ వ‌లంటీర్ల ద్వారా పారదర్శకంగా ఉంటుందని, వారి జాబితాను గ్రామ సచివాలయంలో ప్రదర్శనకు పెట్టాలని అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణశాఖపై సిఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇల్లులేని వారు ఉండకూదనేది తన ఉద్దేశమని, లబ్దిదారులకు పైసా ఖర్చులేకుండా ఇంటిని నిర్మించి ఇస్తామని జగన్‌ చెప్పారు. ఈ ఏడాది శాచ్యురేషన విధానంలో ప్రతి లబ్దిదారుడికీ ఇళ్లస్థలం ఇస్తామని చెప్పారు. వచ్చే ఏడాది నుండి ఇంటి నిర్మాణం చేపడతామని వివరించారు. లబ్దిదారుల జాబితా 365 రోజులూ అందరికీ అందుబాటులో ఉండాలన్నారు. పెన్షనర్ల జాబితానూ సచివాలయాల్లో బోర్డుపై పెడతామని, దీనివల్ల సోషల్‌ ఆడిట్‌ జరుగుతుందని చెప్పారు. లబ్దిదారుల ఎంపికలో పక్షపాతం, అవినీతికి తావులేకుండా చూడాలని, ఎవరైనా తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. పక్షపాతం, అవినీతివల్లే అనేక సమస్యలు వస్తున్నాయని చెప్పారు. ఓటు వేసినా వేయకపోయినా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు ఇవ్వాల్సిందేనని, ఈ ప్రభుత్వం చేసే మంచిని చూసి భవిష్యత్‌లో అయినా ఓటు వేయాలన్నదే తమ సిద్ధాంతమని తెలిపారు. ఇళ్ల నిర్మాణం కోసం గ్రామాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని వినియోగించాలని, లేనిచోట ప్రభుత్వమే కొనుగోలు చేసి పేదలకు ఇవ్వాలని సూచించారు. కొనుగోలు చేసిన భూమిని ప్లాట్ల రూపంలో విభజించి రాళ్లుపాతి లబ్దిదారులకు రిజిస్ట్రేషన్‌ చేయాలని ఆదేశించారు. పట్టా ఇచ్చి స్థలం ఎక్కడుందో తెలియని పరిస్థితి లబ్దిదారుడికి రాకూదన్నారు. ప్రతి రిజిస్ట్రేషన్‌ను ఆధార్‌కార్డుతో లింకు చేయాలని సూచించారు. పట్టణాల్లోనూ ఇదే పద్ధతిని అనుసరించాలని, ముందుగానే ప్లాట్లు కేటాయించి పేర్లతో ఎలాట్‌ చేయాలని తెలిపారు. రీజనబుల్‌ సైజులోనే ఇల్లు ఉండాలని తెలిపారు. గతంలో షేర్‌వాల్‌ అని పేరుపెట్టి చదరపు అడుగు రూ.1100 అయ్యేదాన్ని రూ.2200 నుండి రూ.2300కు పెంచి దోచుకున్నారని సిఎం పేర్కొన్నారు. ప్రతి లబ్దిదారుడిపై నెలకు మూడువేల భారం వేశారని పేర్కొన్నారు. అర్బన్‌హౌసింగ్‌లో కడుతున్న ప్లాట్లపై రివర్స్‌ టెండర్లకు వెళ్లాలని సూచించారు. అదే టెక్నాలజీతో ఈ టెండర్లు పిలవాలని కోరారు. ఎక్కువమంది టెండర్లలో పాల్గొనేలా చూస్తే తక్కువ ధరకు ఇళ్ల నిర్మాణం జరుగుతుందని వివరించారు. నాణ్యత, సౌకర్యాల కల్పనలో రాజీ పడొద్దని సూచించారు. పునాదిస్థాయి దాటిన ప్లాట్ల విషయంలో ఎటువంటి టెక్నాలజీ అయినా ఉపయోగించి పనులు జరిగేలా చూడాలని సూచించారు. డేటా సక్రమంగా లేకపోవడం వల్ల కేంద్రం నుండి రావాల్సిన నిధుల విషయంలో నష్టం జరుగుతుందని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBookTwitter

Tags: ap cm jagan meeting lands

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top