logo

'టిక్ టాక్' పిచ్చితో.. ఒకరి గల్లంతు.!


03-Jul-2019 14:54IST
tic tac is insane

'టిక్ టాక్ ' మత్తులో పడి జనాలు తమకు తెలియకుండానే వారి ప్రాణాలను కోల్పోతున్నారు. ఒక పక్క 'పబ్జీ' మరో పక్క 'టిక్ టాక్' మహమ్మారి యువత ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ ఘోరక్‌పూర్‌లో టిక్ టాక్ చేస్తూ ఇద్దరు యువకులు నదిలో దూకారు. దియనార్ జిల్లాలో మజ్నా నాలా చోటిగండక్ నది వద్దకు సాయంత్రం సరదాగా యువకులంతా కలిసి వెళ్లారు. అక్కడ అందరు నదిపై నిర్మించి ఉన్నా బ్రిడ్జిపై కూర్చొని రకరకాల విన్యాసాలు చేస్తూ తమ చరవాణీలలో చిత్రాలను రికార్డు చేస్తున్న సమయంలో దినార్ అనే యువకుడు నదిలోకి దూకడాన్ని ఆషిక్  అనే మరో యువకుడు తన చరవాణితో షూట్ చేసి ఆనందించాడు. తరువాత ఆ యువకుడు కూడా అదే నదిలో దూకి స్టంట్ చేసేందుకు ప్రయత్నించాడు. దాంతో ఈ ఉదాంతాన్ని గమనించిన స్థానికులు నదిలో దూకి దినార్‌ను కాపాడారు. కానీ ఆషిక్ అనే మరో యువకుడు మాత్రం గల్లంతయ్యాడు. దీంతో అతనికోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 

Tags: tic tac a boy missing

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top