logo

తోటి ఉపాధ్యాయురాలుపైనే అత్యాచారిణికి పాల్పడిన ప్రధానోపాధ్యాయుడు... !!


05-Jul-2019 11:22IST
principal raped his  fellow teacher

ఢిల్లీ: ప్రస్తుత సామాజంలో విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయుడే తోటి ఉపాధ్యాయురాలిపైనా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె దాదాపు రెండేళ్ల పాటు అతడి చేతిలో కీలుబొమ్మల మారి వాడి కామ దాహానికి బలయింది. అతగాడి నీచమైన ప్రవర్తనలకి విసివిసిగిపోయిన బాధితురాలు స్థానిక పోలీసులకు పిర్యాదు చెయ్యడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళితే ...దక్షిణ ఢిల్లీలో నివాసం ఉంటున్న బాధితురాలు(27) దాదాపు రెండేళ్ల క్రితం ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేరింది. ఆ పాఠశాల ప్రిన్సిపాల్ రాకేశ్ సింగ్ ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలన్న నెపంతో  అదనపు తరగతుల పేరిట ఆమెను ఆ పాఠశాలకు రమ్మనేవాడు దాంతో ఆమె రోజూ వెళ్లడంతో, ఒకరోజు తనతో ఏదో మాట్లాడాలని, తన గదికి రమ్మని చెప్పడంతో ఆమెకు అతగాడి వ్యూహం అర్ధం కాక వెళ్ళింది. అక్కడికి వెళ్లాకా...  తనతో రాకేశ్ సింగ్ తియ్యగా మాట్లాడుతూ... మత్తు మందు కలిపినా శీతల పానీయాన్ని తాగమని ఇవ్వడంతో ఆ విషయాన్ని గమనించక పూర్తిగా తాగేసింది. 

తాగిన కొద్ధి నిమిషాల్లోనే తాను స్పృహ కోల్పోయింది. దాంతో వెంటనే ఆ కామాందుడు మైకంలో వున్నా ఆమెను వివస్త్రను చేసి తన కోరికను తీర్చుకున్నాడు. అంతే కాకుండా ఆమె వివస్త్రగా ఉన్న సమయంలోనే వీడియో తీసి  ఈ విషయం గురించి ఎవరికైన చెపితే వీడియోని సామాజిక మాధ్యామాల్లో పెడతానని, ఎప్పుడు పడితే అప్పుడు తన కోరిక తీర్చాలంటూ వేధించసాగాడు. చేసేది ఏమి లేక పంజరంలో బందీ అయిన చిలుకలా ఆమె ఆ రాక్షసుడి చేతిలో బలైంది. రెండేళ్ల పాటు ఆ రాక్షసుడి చేతిలో నరకం అనుభవించింది. ఆమెను బలి పశువును చేయడానికి మరో ఇద్దరు మహిళా టీచర్లు రాకేశ్ సింగ్‌కు సహకరించారు. ఈ క్రమంలో ఓ రోజు ఆమె గర్భవతి కావడంతో అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి తెచ్చారు. వీరి ప్రవర్తనకు విసిగిపోయిన  ఆ ఉపాధ్యాయురాలు తన కుటుంబ సభ్యులకు జరిగినదంతా చెప్పింది.  వారి సహాయంతోనే  స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBookTwitter
  

Tags: principal raped fellow teacher delhi

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top