logo

కులాంతర వివాహం మరో జంటను బలి తీసుకుంది...!!


05-Jul-2019 16:15IST
Interracial marriage sacrificed another couple

 తమిళనాడు:  వారం క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో చోటుచేసుకున్న  పరువు హత్య విషయం తెలిసిందే. తక్కువ కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో.. బాలింతని చూడకుండా... ఓ మామిడి తోటలోకి తీసుకెళ్లి గొంతు నులిమి చంపి, బావిలో పడేశారు. 

ఈ విషాదాన్ని మరవకముందే... గర్భవతి అని చూడకుండా అతి దారుణంగా గొంతు కోసి చంపేశారు. ఆమెతో పాటూ  భర్తను కూడా నరికేశారు. తమను కాదని వేరే కులానికి చెందిన వ్యక్తిని చేసుకున్నందుకు ఈ దారుణం జరిగింది. ఈ దారుణ ఘటన తమిళనాడులోని తుత్తుకుడిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...సొలాయ్‌రాజ్(24) అనే వ్యక్తి తనకి సమీప ప్రాంతంలోని ప్రైవేట్ కంపెనీలో వర్కర్ గా పనిచేస్తుండే  వాడు. అదే ప్రాంతానికి చెందిన జ్యోతి(24)  కూడా అదే కంపెనీలో తోటి  వర్కర్ గా పనిచేస్తూ ఉండేది. ఒకే చోట పనిచేస్తుండటంతో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. 

పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని పెద్దల వద్దకు వెళ్లారు. వీరిద్దరి కులాలు వేరే అవ్వడంతో పెద్దలు పెళ్ళికి నిరాకరించారు. దాంతో వారిరువురు బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకొన్నారు. పెంచి పెద్దచేసిన మమ్మల్ని మోసం చేసి వేరే కులంవాన్నీ పెళ్లి చేసుకుంటావా..?? అని పలుమార్లు వారిని చంపేస్తామని హెచ్చరించారు. పెళ్ళైన మూడు నెలలకే  జ్యోతి గర్భం దాల్చింది. ఈ విషయం జ్యోతి కుటుంబానికి తెలియడంతో ఆగ్రహానికి లోనయ్యారు. అదే రోజు అంటే ఈ నెల 3న ఇంట్లో నిద్రిస్తున్న సొలాయ్‌రాజ్, జ్యోతిలను చంపాలని నిర్ణయించుకున్నారు. 

 అందుకోసం జ్యోతి కుటుంబ సభ్యులు రాత్రి సొలాయ్‌రాజ్, జ్యోతి నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి వెళ్లి కత్తితో వారి ఇద్దరి గొంతుని కోసి వారిద్దరూ చనిపోయారని నిరుద్దరించుకొని అక్కడి నుండి చడీ చప్పుడు చెయ్యకుండా జారుకున్నారు. ఉదయం నిద్ర లేచిన సొలాయ్‌రాజ్ తల్లి ఎంతకు పిలిచినా తలుపు తియ్యకపోవడంతో కంగారుపడి పొరిగింటి వాళ్ళ సాయంతో తలుపులు పగులగొట్టి చూడగా...బెడ్‌పై రక్తపు మడుగులో విగత జీవులుగా పడి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వచ్చి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని, జ్యోతి తండ్రిని అరెస్టు చేశారు. కాగా, తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాలకు అంతిమసంస్కారాలు నిర్వహించేది లేదంటూ సొలాయ్‌రాజ్ బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. 

Tags: Interracial marriage sacrificed couple thamilanaadu

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top