logo

ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం.. !!


05-Jul-2019 17:04IST
Worst in uttar pradesh

ఉత్తర్‌ప్రదేశ్‌: రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. రోజు తనని అనుమానిస్తోందనీ, రకరకాలా ప్రశ్నలతో విసిగిస్తుందని భార్యను, పిల్లలను అతి దారుణంగా కడతేర్చిన కసాయి తండ్రి. వాళ్ళలో ముందు భార్యను, పిల్లలను చంపి ఒక సూసైడ్ లేఖను రాసి ఘటనాస్థలంలో పెట్టి  తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ లేఖను స్వాధీనం చేసుకున్నారు. 

లేఖ ఆధారంగా పోలీసులు తెలిపిన వివరాయలు ఇలా వున్నాయి...ఘజియాబాద్‌ జిల్లాలోని ముసూరీ పరిథిలోని శతాబ్దిపురానికి చెందిన గురు అనే వ్యక్తి నిరుద్యోగి. ఆయన భార్య ఎయిమ్స్‌లో నర్సుగా పనిచేస్తున్నారు. గురుకు ఇతర మహిళలతో సంబంధం ఉండేదని రోజు తన భార్య తనతో గొడవ పడుతుండేది. ఈ నేపథ్యంలో తాజాగా మళ్లీ వివాదం ఏర్పడటంతో ఆమెతో పాటు పిల్లల్నీ కడతేర్చాలని గురు నిర్ణయించుకున్నాడు. ఈక్రమంలో ముందుగా భార్యను చంపి, ముగ్గురు పిల్లల నోట్లో విషం పోసి, అది బయటకు రాకుండా టేప్ చుట్టాడు. దీంతో ముగ్గురు పిల్లలు ఊపిరాడక ప్రాణాలు వదిలారు. తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబం అంతా ఒకేసారి ప్రాణాలు కోల్పోవడంతో శతాబ్దిపురంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు  

Tags: suicide uttar pradesh letter

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top