logo

కేంద్ర బడ్జెట్‌పై స్పందించిన విజయసాయి రెడ్డి..


06-Jul-2019 10:45IST
vijaysai reddy reacts on budget

కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు మొండిచేయి చూపిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. బడ్జెట్‌ కేటాయింపులపై ఆయన స్పందిస్తూ.... కేంద్ర బడ్జెట్‌ తమను నిరాశపరిచింది అన్నారు. బడ్జెట్‌తో ఏపీకి అదనంగా ఇచ్చిందేమీ లేదని, ప్రత్యేక హోదాతో పాటు అమరావతి, పోలవరం నిర్మాణాలకు నిధుల ప్రస్తావనే లేదన్నారు. విభజన చట్టంలోని అంశాలపైనా ఏమీ మాట్లాడలేదని పేర్కొన్నారు. విజయవాడ విశాఖ మెట్రో రైలుకు నిధుల విషయంలో ఏపీకి అన్యాయం జరిగిందని, భారతమాల తదితర పథకాలలో ఏపీ కేటాయింపులపై స్పష్టత లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన ఏ హామీనీ నిలబెట్టుకోలేదని విమర్శించారు.

Tags: vijaysai reddy budget bjp ysrcp

Advertisement
Advertisement
Top