logo

అత్యంత శ్రీమంతుడైన అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ విడాకులు ఖరారు


06-Jul-2019 11:33IST
Worlds biggest divorce settlement

అమెజాన్ వ్యవస్థాపకుడు, శ్రీమంతుడైన జెఫ్ బెజోస్ మరియు అతని భార్య మాకెంజీ బెజోస్ శుక్రవారం తమ విడాకులను 38 బిలియన్ డాలర్ల ఒప్పందానికి ఖరారు చేసినట్లు తెలిసింది. ప్రపంచంలో అందరికన్నా గొప్ప ధనవంతుడైన అమెజాన్ కంపెనీ అధినేత మరియు రూ. 10,47,200 కోట్ల (అక్షరాలా పది లక్షల, నలభై ఏడు వేల, రెండు వందల కోట్ల రూపాయలు) కు అధిపతి అయిన శ్రీమంతుడు జెఫ్ బెజోస్ తన పెళ్లి విడాకులను ఖరారు చేసి, తన మాజీ భార్య మాకెంజీకి దాదాపుగా రూ. 2,58,400 (అక్షరాలా రెండు లక్షల, యాభై ఎనిమిది వేల, నాలుగు వందల కోట్ల రూపాయలు) విడాకుల ఒప్పందం ప్రకారం చెల్లించ నున్నాడు. ఈ విదంగా తన మాజీ భార్య మాకెంజీ ప్రపంచంలో 22 వ ధనవంతురాలుగా స్థానం సంపాదించుకొంది.  ఒప్పందం ప్రకారం, మాకెంజీ బెజోస్, 49, సుమారు 19.7 మిలియన్ అమెజాన్.కామ్ షేర్లను అందుకుంటుంది, ఆమెకు కంపెనీలో నాలుగు శాతం వాటా కూడా లభిస్తుంది. ఈ విదంగా ఆమె బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ సూచికలో 22 వ స్థానం సంపాదించుకొంది అలాగే ఇప్పటి వరుకు ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన పెళ్లి విడాకుల ఖరారు ఇదే. 

అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్ర కింగ్ కౌంటీలోని ఒక న్యాయమూర్తి విడాకులను ఖరారు చేశారు. 55 ఏళ్ల జెఫ్ బెజోస్ తన కంపెనీల్లో 12 శాతం వాటాను కలిగి ఉంటాడు మరియు ప్రపంచంలో  అత్యంత ధనవంతుడిగా తన స్థానం యధావిధిగా దక్కించుకున్నాడు. జెఫ్ మరియు మాకెంజీ బెజోస్ 1993 లో వివాహం చేసుకున్నారు మరియు వారికి నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. వారి విడాకుల వార్త ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. బెజోస్, మాజీ న్యూస్ యాంకర్ లారెన్ శాంచెజ్‌తో ఎఫైర్ కలిగి ఉన్నట్లు తెలిసింది. 25 సంవత్సరాల వివాహం తర్వాత తాను మరియు అతని భార్య విడాకులు తీసుకుంటున్నట్లు జనవరిలో ప్రకటించడంతో మరియు మాజీ న్యూస్ యాంకర్ లారెన్ సాంచెజ్‌తో తనకు ఎఫైర్ ఉందని 'నేషనల్ ఎన్‌క్వైరర్ పత్రిక' వెల్లడించడంతో జెఫ్ బెజోస్ వ్యక్తిగత జీవితం వెలుగులోకి వచ్చింది. జెఫ్ బెజోస్ 1994 లో అమెరికాలోని పచ్చిమ రాష్ట్రమైన వాషింగ్టన్ లోని సియాటెల్ నగరంలో తన కారు షెడ్డులో అమెజాన్‌ను స్థాపించి, ఇంటర్నెట్ ద్వారా వస్తువులను అమ్మే వ్యాపారం చేస్తూ ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఎదిగాడు కానీ స్త్రీ లోలుడై తిరిగి ఈరోజు వార్తల్లో నిలిచాడు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: amazon founder jeff bezos pay $38 billion to wife

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top