logo

తెలంగాణ పదోవ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల


06-Jul-2019 12:50IST
telangana 10 th class results release today

జూన్‌లో నిర్వహించిన పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను శనివారం విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు బీ సుధాకర్ తెలిపారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూన్‌ 10 నుంచి 24 వరకు నిర్వహించిన పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలకు 61,431 మంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 260 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. పదోతరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ఇతర వెబ్‌సైట్లలోనూ ఫలితాలను చూసుకోవచ్చు.

Tags: TS SSC supplementary Result 2019 TS 10th Supplementary results 2019 Bse telangana

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top