logo

వరంగల్‌ జిల్లాలో అధ్యాపకుడిని అరెస్టు చేసిన 'షీ-టీమ్' బృందం..!!


08-Jul-2019 11:12IST
sheteam arrested a teacher in warangal district

వరంగల్: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన అధ్యాపకుడు తరగతిలోని విద్యార్థినుల సెల్‌ఫోన్‌కి అసభ్య సందేశాలు, అశ్లీల చిత్రాలను పంపుతూ వేధిస్తున్న అధ్యాపకుడిని వరంగల్‌ 'షీ' బృందం పోలీసులు అరెస్టు చేశారు. షీ బృందం ఏసీపీ బాబురావు తెలిపిన వివరాల ప్రకారం..  వరంగల్‌ జిల్లా హన్మకొండలోని ఓ ప్రైవేటు కళాశాలలో ములుగు జిల్లా ఇంచర్ల గ్రామానికి చెందిన తొంబురపు రంజిత్‌కుమార్‌ అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. చదువులో వెనుకబడి ఉన్న విద్యార్థినులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులను నిర్వహిస్తానని మభ్యపెట్టి వారికి తన ఫోన్ నంబర్ ని ఇచ్చేవాడు. సందేహాల కోసం ఫోన్‌ చేసిన విద్యార్థినులతో మాటలు కలిపి.. వాట్సాప్‌ లేదా ఎస్‌ఎంఎస్‌ ద్వారా అసభ్యకర సందేశాలతోపాటు, చిత్రాలను పంపిస్తూ...వారిని లైంగికంగా వేధించేవాడు. 

భాదిత విద్యార్థినులలో ఒకరు అధ్యాపకుడి వ్యవహార శైలిని తల్లిదండ్రుల దృష్టికి తీసుకురావడంతో వారు కమిషనరేట్‌ వాట్సాప్‌ నంబర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కమిషనర్‌ రవీందర్‌ ఆదేశాల మేరకు షీ బృందం ఇన్‌స్పెక్టర్‌ బి.శ్రీనివాస్‌రావు  సిబ్బందితో కలిసి రంగంలోకి దిగారు. ఆ అధ్యాపకుడు పనిచేస్తున్న కళాశాల వద్దకు వెళ్లి. కళాశాల సిబ్బందిని, విద్యార్థినులను కలిసి వివరాలు తెలుసుకున్నారు. విషయం నిర్ధారణ కావడంతో హన్మకొండ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదుచేసి అధ్యాపకుడిని అరెస్టు చేశారు. మహిళలు, విద్యార్థినులపై ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడితే వాట్సాప్‌ నంబర్‌ 94910-89257కు సమాచారమివ్వాలన్నారు.  

Tags: she-team arrested teacher warangal

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top