logo

కుమార్తెను కడతేర్చిన కసాయి తండ్రి...!!


08-Jul-2019 11:52IST
a butchers father washing his daughter

 నాగర్‌కర్నూల్‌: అల్లారు ముద్దుగా పెంచి పోషించిన తండ్రే ఆమె పాలిట కాలయముడయ్యాడు. మతిస్థిమితం లేని కుమార్తెను ఓ తండ్రి అతిదారుణంగా గొడ్డలితో నరికి చంపిన ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలంలోని కల్వకోల్‌లో ఇవాళ ఉదయం వెలుగులోకి వచ్చింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...జిల్లాలోని పెద్దకొత్తపల్లి గ్రామానికి చెందిన ఎర్రన్న తన కూతురు శ్యామల (26)కు కొన్నేళ్ల క్రితం పెళ్లి చేశాడు. పెళ్ళైన కొన్నాలకు ఆమె మతిస్థిమితం కోల్పోవడంతో భర్త విడిచిపెట్టేశాడు. దాంతో అప్పటినుంచి ఆమె తన తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. అసలేమయ్యిందో తెలియదుకాని నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత శ్యామల తండ్రి తన ఇంట్లోనే గొడ్డలితో ఆమెను అతి కిరాతకంగా కన్న కూతురని కూడా చూడకుండా నరికి చంపాడు. ఈ విషయం ఈరోజు  ఉదయం వెలుగులోకి రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలను సేకరిస్తున్నారు.  ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.  
 

Tags: butcher's father killing daughter naagarkarnool

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top