logo

ప్రియుడితో మ‌న‌స్ప‌ర్థ‌లు.. హోట‌ల్ రూమ్‌లో ఆత్మ‌హ‌త్య‌..


08-Jul-2019 14:18IST
suicide in a hotel room

న్యూఢిల్లీ: ప్రియుడితో మ‌న‌స్ప‌ర్థ‌లతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతోంది.  ఈ సంఘటన  ఢిల్లీలోని పహారాగంజ్‌లో చోటుచేసుకుంది.  పోలీసులు  తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఓ యువతి తన ప్రియుడితో కలిసి పహారాగంజ్‌లోని ఓ హోటల్‌ రూములో దిగింది. కొద్ది సేపటి తర్వాత ఇద్దరి మధ్యా ఓ విషయంపై గొడవ రావ‌డంతో అతడు ఆమెను అక్కడే వదిలి బయటకు వెళ్లిపోయాడు. ఆమె ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతడు పట్టించుకోలేదు. కొద్దిసేపటి తర్వాత అతడు రూము దగ్గరకు చేరుకుని, తలుపు తట్టినా లోపలినుంచి ఎటువంటి స్పందన లేదు. లోపలినుంచి గడియ పెట్టిఉండటం అతడికి అనుమానం కలిగించింది. తలుపులు ప‌గుల‌గొట్టి చూడ‌గా ఆమె ఫ్యానుకు ఉరివేసుకుని కనిపించింది. దీంతో అతడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు  సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ద‌ర్యాప్తు చేసిన‌ట్లు తెలిపారు.

Tags: woman suicide delhi hotel

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top