logo

తేలు మంట‌కు.. ఫోన్‌లో మంత్రాలు..


09-Jul-2019 11:19IST
scorpion on sewn in student

  • ఉపాధ్యాయుడి మూఢ‌న‌మ్మ‌కానికి బ‌లైన విద్యార్థి
లక్నో: ఓ ఉపాధ్యాయుడి మూఢ‌న‌మ్మ‌కం విద్యార్థి ప్రాణాల‌ను తీసింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఝాన్సీలోని ఓ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ఓ విద్యార్థికి తేలు కుట్టింది. ప్రధానోపాధ్యాయుడు మూఢనమ్మకంతో తేలు కుట్టిన విద్యార్థికి మాంత్రికుడి చేత ఫోన్‌లో మంత్రాలు చెప్పించాడు. ఈలోగా శరీరమంతా పాయిజన్ సోకి విద్యార్థి మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. యూపీలో పాఠశాలలు ఇటీవలే పునఃప్రారంభం కావడంతో.. పాఠశాల ఆవరణలో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని ఓ ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులను ఆదేశించాడు. దీంతో విద్యార్థులు చెత్తను తొలగిస్తున్న క్రమంలో ఓ విద్యార్థికి తేలు కుట్టింది. మంటతో బాధపడుతున్న విద్యార్థిని ఆస్పత్రికి తరలించకుండా.. ఓ మాంత్రికుడి ఇంటికి తరలించారు. ఆ మాంత్రికుడు ఇంటి ద‌గ్గ‌ర‌ లేకపోయే సరికి సదరు ప్రధానోపాధ్యాయుడు.. అతడికి ఫోన్ చేసి.. ఆయన ఫోన్‌లో మంత్రాలు జపిస్తుంటే.. ఆ ఫోన్‌ను బాధిత విద్యార్థి చెవి వద్ద పెట్టాడు. కానీ మంట తగ్గలేదు. ఆ తర్వాత విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై రాష్ట్ర ఉన్నత విద్యా అధికారులు స్పందించారు. ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: school student scorpion uttar pradesh

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top