logo

న‌గ‌రం న‌డిబొడ్డులో దారుణం


10-Jul-2019 10:29IST
puppy lover killed in large

  • యువ‌తిని లాడ్జికి ర‌ప్పించి గొంతుకోసిన ప్రేమోన్మాది
అమ‌రావ‌తి: హైద‌రాబాద్ న‌డిబొడ్డులో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రేమోన్మాది విసిరిన పంజాకు యువ‌తి బ‌లైంది. పట్టపగలే న‌గ‌రం న‌డిబొడ్డులో ఈ ఘాతుకం జరగడం కలకలం రేపింది. వివ‌రాల్లోకి వెళ్తే.. బడంగ్‌పేట నవయుగ ఎన్‌క్లేవ్‌లో ఉండే యువతి(22) ఇటీవల దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో పోటీ పరీక్షల కోసం శిక్షణ తీసుకుంది. నెల్లూరులోని నారాయణరెడ్డిపేటకు చెందిన జాన వెంకటేశ్‌(23) కూడా అదే సంస్థలో శిక్షణ తీసుకున్నాడు. వీరిద్ద‌రికి పరిచయం ఏర్పడింది. శిక్షణ తర్వాత నుంచి యువతి తనను దూరం పెడుతోందనే ఉద్దేశంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. మంగళవారం ఉదయం నెల్లూరు నుంచి దిల్‌సుఖ్‌నగర్‌ చేరుకున్న వెంకటేశ్‌ బృందావన్‌ లాడ్జి గది నం.501లో దిగాడు. నీతో కొంచెం మాట్లాడాలి రమ్మంటూ ఆ యువతికి ఫోన్‌ చేశాడు. దీంతో ఆ యువ‌తి లాడ్జికి వ‌చ్చింది. వీరిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. అతడి ఉన్మాద ప్రవర్తనతో ప్రమాదాన్ని పసిగట్టిన యువతి ఇంటికి ఫోన్‌ చేసి సోదరుడితో కంగారుగా మాట్లాడింది. తాను దిల్‌సుఖ్‌నగర్‌ బృందావన్‌ లాడ్జిలో ఉన్నానంటూ సమాచారం అందించింది. తన సోదరి ఫోన్‌ లైన్‌ కట్‌ కావడంతో ఆందోళనకు గురైన యువతి సోదరుడు తల్లి ఫోన్‌లో నావిగేషన్‌ ఆధారంగా ఆమె ఉన్న ప్రాంతాన్ని కనుగొన్నాడు. వెంట‌నే బయలుదేరి బాధితురాలి కుటుంబీకులు లాడ్జికి చేరుకున్నారు. రెండో అంతస్తులో వారిద్దరూ ఉన్న గదికి వెళ్లి తలుపులు పగులగొట్టారు. అప్పటికే వెంకటేశ్‌ కత్తితో యువతి మెడపై కోయడంతో ఆమె ఒళ్లంతా రక్తంతో నిండిపోయింది. వెంటనే బాధితురాలిని సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వారి మధ్య పెనుగులాటలో ఆమె చేతి వేళ్లు కోసుకుపోయాయి. యువతి మెడకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు 48 గంటలు గ‌డిచాకే ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత వస్తుందన్నారు. 

Tags: hyderabad large puppy lover killed

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top