logo

World Population Day 2019 : జూలై 11.... ప్రపంచ జనాభా దినోత్సవం


11-Jul-2019 10:34IST
world population day celbrations 2019

నానాటికి పెరుగుతున్న జనాభా.. తద్వారా తలెత్తే దుష్పరిణామాలను ప్రజలకు వివరించేందుకు, వారికి ఆయా సమస్యలపై అవగాహన కలిగించేందుకు ప్రతి ఏటా జూలై 11వ తేదీన "ప్రపంచ జనాభా దినోత్సవాన్ని" నిర్వహిస్తున్నారు. 1987వ సంవత్సరంలో ప్రపంచ జనాభా ఐదు బిలియన్లకు చేరుకున్న రోజు "జూలై 11" కాబట్టి... ఆరోజును "ప్రపంచ జనాభా దినం"గా ఐక్యరాజ్యసమితి గుర్తించింది. ఇక అప్పటినుంచి క్రమం తప్పకుండా ప్రతి ఏడాది జూలై 11వ తేదీన ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. 

2010లో ప్రపంచ జనాభా 700 కోట్లు దాటింది. ప్రస్తుతం భూమిపై 800 కోట్లకు పైగా ప్రజలున్నారు. వీరిలో చైనా, ఇండియా కలిపి... 250 కోట్ల మందికి పైగా ఉన్నారు. ఐతే... 2050 నుంచీ ప్రపంచ జనాభా సంఖ్య తగ్గుతుందనే అంచనాలున్నాయి. ముఖ్యంగా చైనా, ఇండియాలో అభివృద్ధి, విదేశీ సంస్కృతుల కారణంగా... ప్రజలు పిల్లల్ని కనేందుకు ఆసక్తి చూపరనీ, ఇప్పటికే ఆ పరిస్థితి కనిపిస్తోందనీ నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో... ఈ ఆలోచనా ధోరణి మరింత ఎక్కువై... జనాభా పెరుగుదల తగ్గి... తిరోగమనంలోకి వెళ్తుందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే... అందరికీ మంచిదే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter 

Tags: world population day world population day 2019

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top