logo

8 మంది దుర్మ‌ర‌ణం


11-Jul-2019 11:57IST
truck rammed into a wedding pandal near the road

బిహార్: బీహార్‌లోని ల‌ఖీస‌రాయ్‌లో దారుణం చోటుచేసుకుంది. ప‌చ్చ‌ని పందిరిలో ర‌క్తం చిందింది. వివ‌రాల్లోకి వెళ్తే.. రోడ్డు ప‌క్క‌నే ఓ ఫంక్ష‌న్ హాల్లో  పెళ్లి జ‌రుగుతోంది. ఈ పెళ్లిలో వంద‌ల మంది బంధువులు సంతోషంగా గ‌డుపుతుండ‌గా ట్ర‌క్కు రూపంలో మృత్యువు స‌రాస‌రి పెళ్లి పందిరిలోకి దూసుకొచ్చింది. ఈ ప్ర‌మాదంలో  ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. 12 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags: truck wedding pandal near road 8 people dead

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top