logo

మద్యానికి బానిసై కన్నకొడుకు చావుకు కారణమైన తల్లి..?


11-Jul-2019 17:40IST
the mother who caused the death of an addict to alcohol

మద్యానికి బానిసైన ఓ కన్నా తల్లి నిర్లక్ష్యంతో తన నాలుగు వారాల కుమారుడి మరణానికి కారణమైంది. వివరాల్లోకి వెళితే...వెస్ట్‌ వేల్స్‌ న్యూక్వాయ్‌కు చెందిన మరీనా టిబ్లే(26)కు డేరియన్‌ అనే నాలుగు వారాల బాబు ఉన్నాడు. తను తల్లి అని మరిచిపోయి మద్యానికి బానిసయ్యింది. అంతే కాకుండా తన కుమారుడి పట్ల ఓ తల్లిలా ఎప్పుడు వ్యవహరించేది కాదు. తరుచుగా చెల్లెలితో కలిసి  బాబును బంతిలా ఒకరిపై ఒకరు విసురుకుంటూ ఆడుకునే వారు.

 ఓ రోజు తన బాయ్‌ఫ్రెండ్స్‌తో నైట్‌క్లబ్‌కు వెళుతూ డేరియన్‌ను కూడా తీసుకెళ్లింది. అక్కడ మద్యం బాగా సేవించి తిరిగి ఇంటికి చేరుకుంది  మద్యం మత్తులో ఉన్న ఆమె కొడుకును బెడ్‌పై పడేసి, అతడిపై పడి నిద్రపోయింది. ఉదయం మరీనా ఇంటికి వచ్చిన ఆమె చెల్లెలు.. నోటినుంచి రక్తం కక్కుకుని చనిపోయి ఉన్న డేరియన్‌ను చూసింది. అతి కష్టంమీద మరీనా శరీరం కిందపడి నలిగిపోయిన బాబును బయటకు లాగింది. సమాచారం అందుకున్న పోలీసులు మరీనాను అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం ఆమెను స్వాన్‌సియా క్రౌన్‌ కోర్టులో ప్రవేశపెట్టారు. నిర్లక్ష్యంతో కన్నకొడుకు చావుకు కారణమైన మరీనాకు క్రౌన్‌ కోర్టు రెండు సంవత్సరాల నాలుగు నెలల జైలు శిక్ష విధించింది.

Tags: west wales newquay mother killed 4 weeks baby

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top