logo

మొసలిని మింగేసిన పాము...!


12-Jul-2019 16:39IST
crocodile swallowed by snake

మనకు సహజంగా పాములంటే చాల భయం అలాంటిది కొండ చిలువలంటే వామ్మో ఇంకేమన్నా ఉందా..! ఉన్న పళంగా పారిపోతాము. అంతే కాకుండా..కొన్ని మన కళ్లతో చూసినా నమ్మలేం. ఇది అలాంటిదే. ఇప్పటివరకూ మనం కొండ చిలువలు... మేకల్ని, ఇతరత్రా జీవుల్ని మింగేయడం చూసి ఉంటాం. మనుషులను ఆరగించడాన్ని చూసి ఉంటాం కానీ ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌కు చెందిన ఆలివ్ పైథాన్‌గా పిలిచే ఈ కొండచిలువ ఆస్ట్రేలియాలో రెండో అతి పెద్ద పాముగా గుర్తింపు పొందింది. నీటిలో నివసించే ఈ కొండ చిలువ 13 అడుగుల పొడవు భారీ ఆకారంతో ఏకంగా కొన్ని గంటల వ్యవధిలోనే  ఒక  భారీ మొసలిని తోకతో సహా అమాంతం మింగేసింది. ఈ అరుదైన దృశ్యాన్ని మార్టిన్ ముల్లెర్ మాత్రమే చూసి తన కెమెరాలో బంధించగలిగాడు. 

Read latest International News  and Telugu News | Follow us on FaceBook, Twitter 

Tags: australia crocodile swallowed snake

Advertisement
Advertisement
Top