logo

రేషన్ డీలర్లపై అధికారుల దాడులు..


12-Jul-2019 17:03IST
officers attacks on ration dealers

నల్గొండ: పేద ప్రజలకు ఉచితంగా అందాల్సిన రేషన్ బియo  పక్కదారి పడుతున్నాయి. ప్రైవేటు వ్యక్తులకు అక్రమంగా విక్రయిస్తున్న డీలర్లపై నిఘా పెట్టిన పౌరసరఫరాల శాఖ అధికారలు అకస్మాతుగా దాడులు చేయగా మద్దిరాల మండలం చందుపట్లలో కోళ్లపాంలో నిల్వ ఉంచిన 180 క్వింటాళ్ల బియ్యం  బయట పడ్డాయి.బియ్యం వ్యాపారీ మెంచు ఉప్పలయ్యను విచారించగా నూతనకల్‌ మండలంలోని ఎర్రపహాడ్‌, మిర్యాల, దిర్శన్‌పల్లి గ్రామాల్లో కొనుగోలు చేసినట్లు చెప్పడంతో ఆయా గ్రామాల రేషన్‌ దుకాణాల పై గురువారం జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి విజయలక్ష్మీ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి నిల్వ దస్త్రాలను పరిశీలించారు. అక్రమంగా బియ్యం నిల్వలున్న నాలుగు దుకాణాలను సీజ్‌ చేశారు. రేషన్‌ డీలర్లపైన చర్యలు తీసుకొని వారిస్థానంలో కొత్తవారికి బాధ్యతలు అప్పగించనున్నట్లు చెప్పారు. దాడుల్లో ఏఎస్‌ఓ పుల్లయ్య, డీటీసీఎస్‌ రాజశేఖర్‌లు పాల్గొన్నారు

Tags: nalgonda officers attacks ration dealers

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top