logo

TS Inter Supply result 2019: రేపే తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు


13-Jul-2019 10:28IST
ts inter supply result 2019 will be declared on july 14

తెలంగాణ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు ఈ నెల 14వ తేదీన అంటే రేపే రానున్నాయి. ఈ విషయాన్ని టీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ శుక్రవారం రాత్రి ట్విటర్‌లో పేర్కొన్నారు. 15వ తేదీలోపు ఇంటర్‌ ధ్రువపత్రాలు సమర్పించాలన్న షరతుపై పలువురు తెలంగాణ విద్యార్థులకు ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు సీట్లు ఇచ్చాయన్నారు. అయితే ఇప్పటివరకు ఇంటర్‌ ఫలితాలు రాకపోవడంతో సీట్లు కోల్పోతారని అంతా ఆందోళన చెందుతున్నారని ఓ విద్యార్థి తల్లి కేటీఆర్‌కు ట్విటర్‌లో విన్నవించారు. దీనికి స్పందించిన కేటీఆర్ ఫలితాల వెల్లడిపై విద్యాశాఖ మంత్రి, కార్యదర్శితో మాట్లాడతానని హామీ ఇచ్చారు.అలా ట్వీట్ పెట్టిన కాసేపటికే... ఈ నెల 14న ఫలితాలు ఇస్తున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ఇప్పుడే చెప్పారని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఫలితాలను మొదట శనివారం ఇవ్వాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయించినా ఉన్నతాధికారుల నుంచి వచ్చిన సూచనల మేరకు జేఎన్‌టీయూహెచ్‌ నిపుణుల పర్యవేక్షణలో తనిఖీ చేయిస్తున్నారు. దీంతో ఫలితాల తేదీని 14కు మార్చారు.

Read latest Education News and Telugu News | Follow us on FaceBookTwitter

Tags: TS inter results TS inter supply results

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top