logo

మాజీ భర్తకు మెసేజ్ పంపిన మహిళ.. మూడు రోజుల జైలు శిక్ష ..


13-Jul-2019 15:00IST
woman sent message to former husband  sentenced to three days in jail

మాజీ భర్తకు మెసేజ్ పంపిందని ఓ మహిళకు ఆ దేశ చట్టం జైలు శిక్ష వేసింది. వివరాల్లోకి వెళితే సౌదీ అరేబియాలో కఠినమైన చట్టాలు అమల్లో వున్న సంగతి తెలిసిందే. సౌదీకి చెందిన ఓ మహిళా ఐదేళ్ల క్రితం కొన్ని కారణాల వల్ల తన భర్తకు విడాకులిచ్చింది. తరువాత ఈ మధ్య కాలంలో మళ్లీ వీరిద్దరి మధ్య వాగ్వివాదాలు చెలరేగడంతో మహిళ తన భర్తకు వాట్సాప్ ద్వారా తీవ్ర పదజాలంతో తిడుతూ మెసేజ్‌లు పెట్టింది. ఈ మెసేజ్‌ను చూసిన ఆమె మాజీ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు మహిళను అరెస్ట్ చేశారు, ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు మాజీ భర్తను దూషించిన కారణంగా భార్యకు మూడు రోజుల జైలు శిక్షను విధించింది.  

Tags: woman whatsapp former husband jail

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top