logo

చికెన్ సెంటర్లపై అధికారుల దాడి.. 50కేజీల చికెన్‌ డంపింగ్ యార్డులోకి


13-Jul-2019 16:50IST
officers raid chicken centers  50 kg of chicken into the dumping yard

శనివారం రోజున మాంసం దుకాణాలు తెరిచి ఉండటంతో అధికారులు దాడులు చేశారు. చికెన్ అంటే చాలు.. నాన్ వెజ్ ప్రియులకు నోరూరిపోతుంది. చికెన్‌లో రకరకాల వెరైటీలను టేస్ట్ చేస్తుంటారు. అలాంటి చికెన్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 కిలోల చికెన్‌పై ఫినాయిలు పోసి అక్కడ్నుంచి డంపింగ్ యార్డుకు తరలించిన  ఘటన నిజామాబాద్ లోని  హైమది మార్కెట్లో చోటుచేసుకుంది. నగరంలో ఉదయం హైమది మార్కెట్లో MHO అధికారులు దాడులు చేశారు. సాజిద్ అలీ ఆధ్వర్యంలో పలు మాంసం దుకాణాలు మరియు చికెన్ సెంటర్లలో దాడులు నిర్వహించారు. పలు చికెన్ సెంటర్లలో సుమారు 50 కిలోల చికెన్ పట్టడం జరిగింది. 

శనివారం మాంసం దుకాణాలు తెరిచి ఉండటంతో ....దాడులు చేసి  చికెన్‌పై ఫినాయిలు పోశారు. అక్కడ్నుంచి డంపింగ్ యార్డుకు తరలించారు. ఇన్చార్జి MHO సాజిద్ అలీ మాట్లాడుతూ ప్రతి శనివారం మాంసం షాపులు చికెన్ సెంటర్ల తెరచి ఉంచి విక్రయించిన వాటిపై దాడులు చేశామని, నగర పాలక సంస్థ నిబంధనల ప్రకారమే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రతి శనివారం దాడులు నిర్వహిస్తామని  తెలిపారు. 



Tags: Officers raid chicken centers 50 kg of chicken dumping yard

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top